bappa.org
Maharashtra Ganeshotsav Archive
2026-01526
మా తండ్రిగారి బాట...
నా బాల్యం నుండి మా తండ్రిగారు నాకు నేర్పిన ఎన్నో మంచి సాంస్కృతి కార్యక్రమాలు మరియు మంచి పనులు చాలా ఉన్నవి అందులో ముఖ్యంగా మా తండ్రిగారు మాకు నేర్పిన దానిలో ఒకటి గణపతి పండుగ ఎందుకంటే మా తండ్రి గారి కాలం నుండి కొన్ని వస్తున్నది మహాగణపతి స్థాపన, మా తండ్రిగారు చెప్పుతుండేవారు ఆదిదేవుడు మహాగణపతి అని ముందుగా అతని పూజ చేసిన తర్వాతే మిగతా దేవత దేవుళ్ళ పూజలు చేయాలని, అదేవిధంగా నాకు ఊహ వచ్చినప్పటి నుండి నేను గమనిస్తున్నాను మన హిందూ సాంప్రదాయం లో కూడా ముందుగా గణపతి పండుగను మన ప్రతి ఒక్క పండుగలు మొదలవుతాయి ఈరోజు మా తండ్రిగారు పరమతించి కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉన్నది కానీ తను నేర్పించిన విధముగానే మేము మా ఇంట్లో గణపతి స్థాపన చేస్తూ ఉంటాము ఈరోజు నేను కూడా మా తండ్రిగారి స్థానంలో ఉన్నాను నా ఇద్దరి కొడుకులకు కూడా ఇదే నేర్పిస్తున్నాను ఇలాగే మనమందరం కలిసి మన సంస్కృతిని కాపాడుకుంటూ ముందుకు వెళితే మన సంస్కృతి ఎప్పటికీ చెరిగిపోదు అని ఆలోచనతోనే ఈ చిన్న కథ రూపంలో నేను మీకు నా యొక్క జీవిత కథను గణపతి రూపం ద్వారా తెలియపరిచినాను
- Kind
- Story
- Place
- Mumbai City
- Art
- Rules of Discipline (Vainayikī vidyā) · Kala 63
- Contributed by
- Recorded, name withheld by the contributor
- Submitted
- 18 September 2026
- Accepted
- 18 September 2026
Evidence
This entry is record #1536 in a hash chain of 2,051. Each record commits to the one before it, so a change to any earlier record breaks every hash after it.
Record hash71a77e8e1b205b7e80606a402eeaacc58163564eb0df244e7589d5494fd2185c
Chain head5d4bccfe2524bc72c35fa2940e30eb3a6c2d65e9d5f493f1cad3dc0e6b3c3c1e
The chain verifies end to end as of this page load.


